- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కాకతీయ, జగిత్యాల : నేర విచారణ సమర్థవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్థవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని ఆయన సూచించారు. బుధవారం జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఎన్నికల నియమావళి, ఎన్నికలకు సంబంధించి అధికారులు తీసుకోవలసిన చర్యలపై, నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకోవలసి చర్యలు వివరించారు.
ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై దృష్టి సారించాలని, గత ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు నమోదయిన వ్యక్తులు, పాత కక్షలు మనసులో పెట్టుకుని నేరాలు చేసేవారిని, నేర స్వభావం కలిగిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ ల వారీగా గుర్తించి బైండోవర్ చేయాలని అదేశించారు. అనంతరం విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. సమావేశం లో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, డీఎస్పిలు వెంకటరమణ , రఘు చందర్,రాములు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


