ఖతార్‌కు కల్వకుంట్ల కవిత
విదేశాల్లో బతుకమ్మ వేడుకలకు పయనం
ఉదయం ఢిల్లీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతి వేడుకలకు హాజరు
కవిత విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : విదేశాల్లో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం ఉదయం 11 గంటలకు హర్యానాలోని రోహ్తక్ లో నిర్వహించిన మాజీ ఉప ప్రధాని దేవిలాల్ 112వ జయంతి వేడుకలకు హాజరయ్యారు. సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి ఖతార్‌కు వెళ్లారు. 26న (శుక్రవారం) ఖతార్‌లో తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటారు. 27న మల్టాకు చేరుకొని తెలంగాణ జాగృతి మాల్టాశాఖ నిర్వహించే సంబరాల్లో పాల్గొంటారు
28న లండన్‌కు చేరుకొని తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.


