కొత్త పార్టీ కష్టమే
నడపడమూ అంత ఈజీ కాదు
తెలంగాణలో పొలిటికల్ స్పేస్ లేదు
చిరంజీవి, దేవెందర్ గౌడ్ పార్టీలు పెడితే ఏమయ్యాయో చూశాం
కవిత పొలిటికల్ జర్నీపై మండలి చైర్మన్ గుత్తా ..
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పొలిటికల్ జర్నీపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన… ఇపుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ నడపడం కష్టమన్నారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి.. పార్టీలు పెట్టి నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు.. చిరంజీవి, దేవెందర్ గౌడ్ పార్టీలు పెడితే ఏమయ్యాయో చూశామని చెప్పారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు కవిత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగాది నాటికి కొత్త పార్టీపై ప్రకటన చేస్తానని తెలిపారు. ఈక్రమంలో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత కొత్త పార్టీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
కవిత రాజీనామాపై..
రాజీనామా ఇన్ పర్సన్ ఇస్తే ఆమోదం అవుతుంది. సభ్యులు కాకుండా ఇతరుల ఇస్తే రాజీనామా ఆమోదం కాదు. కవిత ఇన్ పర్సన్ ఇచ్చారు ఆమోదం తెలిపాం. మొదట కవిత రాజీనామా పీఏ ద్వారా పంపించారు. ప్రెస్ మీట్ లో రాజీనామా లేఖ పంపించిన్నట్లు మాట్లాడారు. ఇలా చేస్తే రాజీనామా ఆమోదించలేము కదా..! రీసెంట్ గా నేరుగా కలిసి రాజీనామా ఆమోదించాలని కోరారు. కవిత ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. రిజైన్ చేసే వారు ఎవరికైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. శాసనసభ్యులు, మండలి, పార్లమెంట్‌లో ఎక్కడైనా ఇస్తారు. ఆమె రాజీనామా ఎందుకు చేస్తున్నారో కవిత చెప్పారు. దాని నేను ఆపలేను, జడ్జ్ చేయలేను కదా.. కవిత నేరుగా వచ్చి రాజీనామా ఇస్తే అప్పుడే ఆమోదించేవాడిని. ఇటీవలే సెషన్‌కి వచ్చినపుడు ఒకసారి ఆలోచించుకోమని చెప్పాను. లేదు ఆమోదించాలి.. ఆమోదించే ముందు మాట్లాడే అవకాశం కల్పించాలని ఆమె కోరారని గుత్తా తెలిపారు


