క్రైస్తవ విశ్వాసులకు శాంతి, సమాధానాల సందేశం..
సెంటినరి కమిటీ ఆధ్వర్యంలో విశ్వాసుల సమక్షంలో నూతన వేడుకలు..
కాకతీయ, హనుమకొండ : సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి, వాడ్నల రాము ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీ నరసింహ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి, అవసరమైన వారికి బెడ్ షీట్లు పంపిణీ చేశారు. త్వరలో మహిళల కోసం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. 2026 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగ నుంచి నూతన సంవత్సరం వరకు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం యేసు చూపిన మార్గంలో నడవడమేనని, అది శాంతికి నిదర్శనమని అన్నారు. మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్లు అందిస్తామని తెలిపారు. సంఘ పాస్టర్ రేవరెండ్ వాడ్నల రాము మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం యేసు చూపిన మార్గంలో నడుచుకుంటూ, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను స్మరించుకోవాలని అన్నారు. నూతన సంవత్సరంలో యేసుక్రీస్తు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ శాంతి, సమాధానాలతో ఐక్యతగా జీవించాలని క్రైస్తవ విశ్వాసులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చర్చి అధ్యక్షుడు విశ్రాం కిరణ్, ఉపాధ్యక్షుడు మంద ఆంధ్రయ్య, సభ్యులు సుమంద సురేందర్, జాయింట్ సెక్రటరీ మంద సుదర్శన, ట్రెజరర్ వస్కుల జాన్ పాల్గొన్నారు. సెంటినరి కన్వీనర్‌గా సుమంద ప్రసాద్, గాస్పెల్ కన్వీనర్‌గా విశ్రాం విక్టర్, కన్స్ట్రక్షన్ చైర్మన్‌గా వస్కుల భాస్కర్ వ్యవహరించారు. ఈసీ మెంబర్స్‌గా వస్కుల ప్రభాకర్, మత్తయి, మంద సాల్మన్, కొట్టే ప్రవీణ్ పాల్గొన్నారు. ఉమెన్స్ కమిటీ అధ్యక్షురాలిగా విశ్రాం సరోజ, యూత్ ప్రెసిడెంట్‌గా మంద పవన్ కుమార్, సండే స్కూల్ సూపరింటెండెంట్‌గా విశ్రాం పాల్సన్ ఉన్నారు. సెంటినరి కమిటీ సభ్యులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


