“సింగరేణిలో మెడికల్ బోర్డ్ నిర్వహించాలి”
కాకతీయ, రామకృష్ణాపూర్ : సింగరేణిలో మెడికల్ బోర్డ్ తిరిగి నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసీఎంవో మధు కుమార్ కు మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా చేపట్టే పోరాటాలకు కార్మికులు కలిసి రావాలని కోరారు. కృష్ణ,సురేష్,శ్రీనివాస్,సంతోష్,కుమార్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


