కాకతీయ, వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పింది. ఓ గూడ్స్ రైలు..గోదాములో యూరియా బస్తాలను డంప్ చేస్తి..తిరిగి వెళ్తున్న క్రమంలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గోడను ఢీకొట్టింది. ఈఘటనలో గోడ పూర్తిగా ధ్వంసం అయ్యింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరిగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా గూడ్స్ రైలు వెనక నుంచి గోడను ఢీకొట్టడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వరంగల్ రైల్వే స్టేషన్ లో తప్పిన పెను ప్రమాదం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


