ఎంపీ వద్దిరాజుకు “అక్షర కానుక”
కాకతీయ, ఇనుగుర్తి : బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి వాస్తవ్యుడు, ప్రముఖ గాయకుడు,చిరకాల అభిమాని ఓరుగంటి మధు (ఇనుగుర్తి)”అక్షర కానుక”ను బహుకరించారు.సుప్రసిద్ధ గాయకురాలు అరుణోదయ విమలక్క,సౌండ్ ఇంజనీర్ రవితో పాటు ఎంపీ రవిచంద్రను కలిసి ఈ “అక్షర కానుక”ను బహుకరించారు.వద్దిరాజు రవిచంద్ర పేరులో ఉన్న అర్థాన్ని,ఆయన వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని వివరిస్తూ ఈ “అక్షర కానుక”ను ఫోటోతో పాటు ఫ్రేం కట్టించి విమలక్క ద్వారా మధు అందజేశారు.అలాగే,మధు త్వరలో ఎంపీ రవిచంద్ర ఆశీస్సులతో వీఆర్సీ పేరుతో హన్మకొండ సుబేదారిలో తాను నెలకొల్పనున్న రికార్డింగ్ స్టూడియో,డీజే సౌండ్స్ బ్రోచర్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.ఈ సందర్భంగా మధును ఎంపీ వద్దిరాజు అభినందించి తన ఆశీస్సులు అందజేశారు.


