epaper
Thursday, March 26, 2026
epaper

పేద‌ల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర‌

పేద‌ల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర‌
311 మందికే ఇళ్లు మంజూరు చేశారు.. మిగ‌తావాళ్ల ప‌రిస్థితేంటి..?
ఆరు గ్యారంటీల అమ‌లులో ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ధ్వ‌జం
ఖమ్మం కలెక్టరేట్ వద్ద బీజేపీ భారీ ఆందోళన

కాకతీయ, ఖమ్మం : పేదల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర దాగి ఉందని, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం చర్యలు తీసుకుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ఆరోపించారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. భూదాన్ భూముల్లో పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం దారుణమని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇళ్లను కూల్చిన తర్వాత కేవలం 311 మందినే అర్హులుగా గుర్తించడం అన్యాయమని, మిగిలిన పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయంపై చెప్పే లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదని, కాంట్రాక్టుల్లో కమీషన్లకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ఖమ్మం నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమవుతుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ పోరాటానికి రాష్ట్ర నాయకత్వం పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లారావు యాదవ్, నాయకులు నున్నా రవికుమార్, రవిరాథోడ్, గుత్తా వెంకటేశ్వర్లు, మందడపు సుబ్బారావు, రామ్శెట్టి నాగేశ్వరరావు, కుంచెం కృష్ణారావు, వక్కలంక సుబ్రమణ్యం, మేకల నాగేందర్, మంద సరస్వతి, రజిని రెడ్డి, ఏలూరి నాగేశ్వరరావు, మణి, ఇవి రమేష్, జ్వాల నరసింహారావు, గడిల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన

గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన సెల్వరాజును రక్షించిన పోలీసులు వాకింగ్‌కు వెళ్లిన మాజీ సర్పంచ్...

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం విద్యారంగ సమస్యల పరిష్కారం కోరితే అక్రమ అరెస్టులా? ప్రజాపాలనలో...

శభాష్ సుష్మ

శభాష్ సుష్మ పోలీస్ స్పోర్ట్స్-మీట్‌లో బంగారు ప‌త‌కాలు సాధించిన కానిస్టేబుల్ కాకతీయ ,కొత్తగూడెం :...

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత మాజీ ఎమ్మెల్యే సండ్ర వేంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి...

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం...

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం సాగును లాభసాటిగా మార్చే దిశగా చర్యలు యాంత్రీకరణ, అనుబంధ...

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్...

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్యక్రమం సీఐ వి విజయ్ రామ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img