కాకతీయ, హనుమకొండ : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రాజోజు రామచంద్రాచారికి తన మిత్రులు ఆర్థిక సాయం అందించి తమ ఔదార్యన్ని చాటారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 బ్యాచ్‌కు చెందిన రాజోజు రామచంద్రాచారి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆపదలో ఉన్న మిత్రుడి విషయం తెలుసుకున్న మిత్రులు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి వైద్య ఖర్చుల కోసం నలభైవేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్న మహేంద్ర, బుస్స శ్రీనివాస్, ఏదుల మనోహర్, డి. సంజీవరావు, పైండ్ల శంకర్, ఐలి సురేందర్, కోకిల బిక్షపతి, కోగిల చంద్రమౌళి, బత్తుల వీరభద్రమ్ తదితరులు పాల్గొన్నారు.


