మహిళా పోలీసులకు ఘన సన్మానం
మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
కాకతీయ, కరీంనగర్ రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డి తదితరులు మహిళా పోలీసులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మహిళా పోలీసులు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో మహిళలు, విద్యార్థినులు పోలీసులకు సహకరించాలని కోరారు. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల ప్రమాదాలపై మహిళా పోలీసులు వివరాలు తెలియజేస్తున్నారని చెప్పారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


