క్రీడలతో విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు
కాకతీయ, నెల్లికుదురు: క్రీడలతో గొప్ప భవిష్యత్తు ఉంటుందని ఎంఈవో రాందాస్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఐలయ్య అన్నారు. స్కూల్ గేమ్స్ పేడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రీడా ఎంపిక పోటీలు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. అండర్ 14, 17 బాలబాలికల విభాగంలో నెట్ బాల్, సెపక్ తక్రా, తంగ్ తా, ఫెన్సింగ్, ఎంపిక క్రీడలను ఆయన ప్రారంభించారు. నిత్యం చదువుతోపాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యపరంగా దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు రవి, ఎజీఎఫ్ఐ సహాయ కార్యదర్శి సిహెచ్ ఐలయ్య, కొప్పుల శంకర్, అనిల్, ఎమ్డీ ఇమామ్, విజయ్ చందర్, సునీత, ప్రణయ్ ప్రభు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.


