ఘనంగా కంఠమహేశ్వర స్వామి కల్యాణం
కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని గట్టికల్లు గ్రామంలో గౌడ కులస్తులు ఆరాధ్య దైవంగా కొలుచుకునే సుమరాంబ, కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మామిడి తోరణాలతో ఆలయాన్ని అలంకరించి గణపతి పూజా కార్యక్రమం,గౌడ కులస్తుల ఇంటి నుండి తీసుకువచ్చిన జలబిందలు,పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి నూతన వస్త్రాలంకరణ చేశారు.సోమవారం రాత్రి ఊరేగింపుగా వెళ్లి అత్యంత భక్తిశ్రద్ధలతో కంఠమహేశ్వర స్వామికి బోనం నైవేద్యంగా సమర్పించారు.ఈ సందర్భంగా గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు మెరుగు ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న గౌడ కులస్తులంత మాల ధరించి మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పండగ నిర్వహించామన్నారు.ఇలాంటి పండుగలు ప్రతి ఒక్కరి మధ్య ఐక్యత,సమానత్వానికి తోడ్పడతాయని ఆయన అన్నారు.చిర్ర నాగరాజు, దొనగాని సతీష్,చిర్ర యాక సాయిలు, పెదగాని యాకయ్య,మెరుగు అనిల్ తదితరులు పాల్గొన్నారు


