కాకతీయ, నెల్లికుదురు: శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో నెల్లికుదురు మండలానికి చెందిన ముగ్గురు టీచర్లను సన్మానించినట్లు మండల విద్యాశాఖ అధికారి ఏ రాందాస్ తెలిపారు.
ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణ మూర్తి చేతులమీదుగా సన్మానం పొందారని, జిల్లా నుండి మొత్తం 18 మండలాల నుండి 12 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేస్తే అందులో ముగ్గురు నెల్లికుదురు మండలానికి చెందిన ఉపాధ్యాయులే కావడం గర్వించదగ్గ విషయమని అన్నారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మాన పొందిన తండా హరీష్(జెడ్పిహెచ్ ఎస్ ఆలేరు), అక్కేపల్లి కుమారస్వామి(ఎంపీయూ పీఎస్ సీతారాంపురం), అజూమ్ సుల్తాన్(టి.జి.ఎం.ఎస్ నెల్లికుదురు) ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


