ఎస్సీ సర్పంచులకు ఘన సన్మానం
కాకతీయ, తొర్రూరు : అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తాము ఈ రోజు సర్పంచులుగా నిలబడ్డామని నూతనంగా ఎన్నికైన ఎస్సీ, ఎస్సీ ఉపకులాల సర్పంచులు పేర్కొన్నారు. తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతన సర్పంచులకు ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ మంద యాకములు మాదిగ, జిల్లా కార్యదర్శి బచ్చలి వెంకన్న మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విశ్రాంతి భవనంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బంగారు రమేష్ మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తాను ఈ రోజు ప్రజాప్రతినిధిగా నిలబడ్డానని అన్నారు. విషంపల్లి కవిత బాలకృష్ణ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుతూ, దాని విలువలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఎమ్మార్పీఎస్ పోరాటాల వల్లే ఎస్సీ వర్గాలు గర్వంగా జీవించగలుగుతున్నాయని తెలిపారు. ఈ అవకాశానికి ఎమ్మార్పీఎస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలగిరి సర్పంచ్ యనమల సావిత్రి శ్రీనివాస్, కిష్ణపురం సర్పంచ్ నకరికంటి మాధవి సంపత్, చర్లపాలెం సర్పంచ్ ధర్మారపు మహేందర్, వెలికట్ట సర్పంచ్ బండి శ్రీనివాస్, చింతలపల్లి సర్పంచ్ ఈనెపల్లి భద్రమ్మ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ మాదిగ, రాష్ట్ర నాయకులు రాయి చెట్టు ఉపేందర్ మాదిగ, రమేష్ మాదిగ, సనికే శ్రీనాథ్ మాదిగ, గిద్ద వినీత్ మాదిగ, సనికినేని జీవన్ మాదిగ, గిద్దె టింకిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.


