జిజేసి లో ఘనంగా వీడ్కోలు సమావేశం
కాకతీయ, నెల్లికుదురు: ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నెల్లికుదురులో బుధవారం వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ ఆరిగకూటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హాజరై ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో జూనియర్ కాలేజ్ దశ ఎంతో కీలకమని, ఇక్కడ పొందిన విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలు వారి భవిష్యత్‌ను దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదువుతూ సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వీడ్కోలు సమావేశంలో అధ్యాపకులు విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటూ భవిష్యత్‌కు సంబంధించిన విలువైన సూచనలు అందించారు. విద్యార్థులు కూడా కళాశాలలో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంగా మాట్లాడారు.సమావేశం అనంతరం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, సభలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, ప్రకాష్ బాబు, కవిరాజ్, రఘురాం, నాగేశ్వరరావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సుధాకర్, మహేందర్, రామ్మూర్తి, బాబు, అనిల్ కుమార్, సతీష్, యాకన్న అధ్యాపకేతర సిబ్బంది ప్రదీప్, గౌరీశంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


