ఘోర రోడ్డు ప్రమాదం బైక్‌పై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా విషాద ఛాయలు మిగిల్చింది. రాంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆవుల రవి (45) అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కోర్టు చౌరస్తా నుంచి మంచిర్యాల చౌరస్తా వైపు బైక్‌పై వెళ్తున్న రవిని వెనుకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దాంతో ఆయన బైక్ నుంచి కిందపడగా, వెంటనే వెనుకనుంచి వచ్చిన ట్యాంకర్ లారీ ఆయనపై నుంచి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మృతుడు కరీంనగర్ పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆకస్మిక మరణ వార్తతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర ఉపాధ్యాయులు విషాదంలో మునిగిపోయారు.


