కాకతీయ, కరీంనగర్: బాలలు బడిలో ఉండాలి, పనిలో కాదని, విద్య ద్వారానే బాల కార్మిక నిర్మూలన సాధ్యమవుతుందని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్ర బోస్ అన్నారు. 2009 ఉచిత విద్యా చట్టం అమలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం, బాల్య వివాహాల నివారణ, హోటళ్లలో బాలల వాడకంపై కఠిన చర్యలు అవసరమని ఆయన సూచించారు.
బాలల హక్కులపై అవగాహన కల్పించడం, సమాజం మద్దతు ఇవ్వడం ద్వారా మంచి లక్ష్యాలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో అలీం అబ్దుల్ ఖాలిఖ్, ఉల్లేందుల తిరుపతి, ఎండి పురుఖాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


