epaper
Sunday, March 1, 2026
epaper

కొండాకు ఝ‌ల‌క్‌

కొండాకు ఝ‌ల‌క్‌
దూర‌మ‌వుతున్న అనుచ‌రులు..!
అత్యంత స‌న్నిహితుడైన న‌ల్గొండ ర‌మేష్ సార‌య్య వ‌ర్గంలోకి
జీడ‌బ్ల్యూఎంసీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం
కార్యకర్తలను అక్కున చేర్చుకుంటున్న ఎమ్మెల్సీ
పెరుగుతున్న సంఖ్యాబ‌లం.. అస‌మ్మ‌తి నేత‌లంతా ఒక్క‌చోట‌కు
వ‌రంగ‌ల్ తూర్పులో మారుతున్న రాజ‌కీయ‌ స‌మీక‌ర‌ణం

వరంగల్ నగర కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. మంత్రి అధికారాన్ని లెక్కచేయకుండా ద్వితీయ శ్రేణి, సీనియర్ నాయకులు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శిబిరానికి ఒక్కొక్కరిగా చేరుతున్నారు. కొండా దంప‌తుల‌ ‘కుడి భుజం’గా పేరున్న నల్గొండ రమేష్ సార‌య్య వ‌ర్గంలోకి వెళ్ల‌డంతో వ‌రంగ‌ల్ తూర్పులో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగర కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి అధికారాన్ని సైతం లెక్కచేయకుండా, పార్టీ మనుగడ, కార్యకర్తల రక్షణే ధ్యేయంగా ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరుగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శిబిరానికి చేరుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నా, కార్యకర్తలకు న్యాయం జరగడం లేదనే భావనతో, మంత్రి వర్గాన్ని దూరంగా పెట్టి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే, కష్టాల్లో తోడుండే నాయకత్వం కావాలన్న ఆశయంతో నాయకులు సారయ్య చెంతకు చేరుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం.

కొండాకు నల్గొండ దూరం.. సార‌య్య వ‌ర్గంలోకి ర‌మేష్..!

గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కొండా సురేఖ గెలుపున‌కు కీలకంగా వ్యవహరించిన న‌ల్గొండ ర‌మేష్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శిబిరంలో చేరడం వరంగల్ తూర్పు కాంగ్రెస్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ చేరికతో సారయ్య వర్గానికి భారీ బలం చేకూరిందని కార్యకర్తలు భావిస్తున్నారు. రమేష్ చేరిక అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ ఒక్కొక్కరిగా సారయ్య వైపు మళ్లుతోంద‌న్న చ‌ర్చ మొద‌లైంది. ఇది మంత్రి సురేఖ వర్గానికి గట్టి ఎదురుదెబ్బగా కూడా అభివ‌ర్ణిస్తున్నారు.
గెలిపించిన కార్యకర్తలను పక్కనపెట్టి, గతంలో బీఆర్ఎస్‌లో ఉండి ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లోకి వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వడం, మరో ముఖ్య నాయకుడికి పార్టీ మొత్తం బాధ్యతలు అప్పగించడం తమలాంటి సీనియర్ నాయకులను అవమానపరిచినట్టేనని ఇటీవ‌ల కాంగ్రెస్ నేత‌ల అంత‌ర్గ‌త స‌మావేశంలో న‌ల్గొండ ర‌మేష్ వ్యాఖ్య‌నించిన‌ట్లుగా తెలుస్తోంది. ప‌రోక్షంగా కొండా దంప‌తుల ప్ర‌ధాన అనుచ‌రుడిగా ప్ర‌చారంలో ఉన్న న‌వీన్‌రాజ్‌ను ఉద్దేశించే ర‌మేష్ ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌న్న‌ది ప్ర‌ధాన చ‌ర్చ‌గా ఉంది. ర‌మేష్ కంటే ముందే కొంత‌మంది గ‌తంలో కొండా ముర‌ళితో క‌లిసి ప‌నిచేసిన వారిలో ఇప్పుడు సార‌య్య వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. కొండా దంప‌తుల‌ వ్యవహార శైలిపై అసంతృప్తితో, సారయ్య అనుభవాన్ని, నాయకత్వాన్ని గుర్తించి శిబిరం మార్చుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు రెండు వర్గాల మధ్య పోటీని మరింత ఉధృతం చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img