epaper
Tuesday, March 10, 2026
epaper

కేస‌ముద్రంలో హోరాహోరీ

కేస‌ముద్రంలో హోరాహోరీ

కాంగ్రెస్, బీఆర్ఎస్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్‌
కొత్త‌గా ఏర్ప‌డిన మున్సిపాలిటీ కావ‌డంతో ప్ర‌తిష్టాత్మ‌కం
రిజ‌ర్వేష‌న్లు అనుకూలించ‌క లీడ‌ర్ల నారాజ్‌
చైర్మ‌న్ ప‌ద‌వి ఎస్టీ మ‌హిళ‌కు కేటాయించ‌డంతో నిరాశ‌
ప‌ట్ట‌ణంలో రెండు శిబిరాలుగా అధికార పార్టీ
వేం.. ముర‌ళీనాయక్ వర్గాల మ‌ధ్య ఆధిప‌త్యం
స‌న్నాహ‌క స‌మావేశాలు సైతం వేర్వేరుగానే..
బీఆర్ఎస్‌కు క‌లిసి రానున్న‌ కాంగ్రెస్ వ‌ర్గ‌పోరు ?
వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్న క‌విత‌, శంక‌ర్‌నాయ‌క్‌
స‌త్తా చాటేందుకు బీజేపీ, స్వ‌తంత్రులు సిద్ధం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: మ‌హ‌బూబాబాద్ జిల్లా కేస‌ముద్రంలో పుర‌పోరు ఉత్కంఠ రేపుతోంది. కొత్త‌గా ఏర్ప‌డిన మున్సిపాలిటీ కావడంతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. నోటిఫికేష‌న్ రాక‌ముందే ఇప్ప‌టికే ప్ర‌చారంలోకి దూకిన నేత‌లు.. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు ఎవ‌రికి వారుగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ప‌ట్ణ‌ణ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తం 16 వార్డులున్న కేసముద్రం మున్సిపాలిటీ చైర్మ‌న్ ప‌ద‌వి తొలిసారి ఎస్టీ మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వ్ అయింది. దీంతో చైర్మ‌న్‌పీఠంపై ఆశ‌లు పెట్టుకున్న కీల‌క లీడ‌ర్ల‌కు నిరాశే ఎదురైంది. ఇక వార్డు కౌన్సిల‌ర్‌గా పోటీ చేయాల‌నుకొని ఎదురుచూస్తున్న ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు సైతం రిజ‌ర్వేష‌న్ క‌లిసి రాక‌పోవ‌డంతో ఇత‌ర వార్డుల నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్‌, బీఆర్ఎస్ స‌న్నాహ‌క స‌మావేశాల‌తో ప్ర‌చారం మొద‌లుపెట్ట‌డంతో ప‌ట్ణ‌ణ రాజకీయం క్ర‌మంగా వేడెక్కుతోంది.

కాంగ్రెస్‌లో గ్రూప్ వార్‌

అధికార కాంగ్రెస్ పార్టీలో వ‌ర్గ‌పోరు మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు, సీనియ‌ర్ నేత వేం నరేంద‌ర్‌రెడ్డి సొంత మండ‌లం కావ‌డంతో కేస‌ముద్రం రాజ‌కీయాల్లో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ ప‌ద‌వుల‌తోపాటు, నామినేటెడ్ పోస్టుల్లోనూ కీరోల్ ప్లే చేస్తున్నార‌నే టాక్ ఉంది. స్థానిక ఎమ్మెల్యేకు కూడా తెలియ‌కుండా కొన్ని కీల‌క నిర్ణ‌యాలు జ‌రిగిపోతుండ‌టం ముర‌ళీనాయ‌క్‌కు రుచించ‌డంలేదు. నియోజ‌క‌ర్గంతోపాటు ముఖ్యంగా కేస‌ముద్రంలో వేం అనుచురులు అన్నీతామై వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో పార్టీ ఇక్క‌డ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. కేసముద్రం మార్కెట్ చైర్మన్ ప‌ద‌వి విష‌యంలోనూ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశాలు సైతం ఈ రెండు వ‌ర్గాలు వేర్వేరుగా నిర్వ‌హించుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. అధికార పార్టీలో చోటుచేసుకున్న ఈ ప‌రిణామాలు కేడ‌ర్‌ను గంద‌ర‌గోళానికి గురిచేస్తున్నాయి. కాగా.. ధ‌న‌స‌రి ఉప స‌ర్ప‌చ్, కాంగ్రెస్ నేత బానోత్ వెంక‌న్న స‌తీమ‌ణి పేరు చైర్మ‌న్ రేసులో ప్ర‌స్తుతానానికి ప్ర‌చారంలో ఉంది. నోటిఫికేష‌న్, నామినేష‌న్ల స‌మ‌యానికి మ‌రికొంద‌రు పేర్లు తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

క‌విత‌, శంక‌ర్‌నాయ‌క్ వ్యూహాలు..

అధికార పార్టీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బీఆర్ఎస్‌కు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంది. కేసముద్రం మున్సిప‌ల్ చైర్మ‌న్ పీఠంపై క‌న్నేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ క‌విత‌, మాజీ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ నాయ‌కులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గెలిచి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు. బీఆర్ఎస్‌ నుంచి మున్సిప‌ల్ చైర్మ‌న్ రేసులో మాజీ మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు జాటోత్ హ‌రీష్ నాయ‌క్ స‌తీమ‌ణి, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్ష‌డు గుగులోత్ వీరునాయ‌క్ భార్య (మాజీ ఎంపీటీసీ) పేర్లు వినిపిస్తున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాల‌న‌పై ప్ర‌జ‌లు పూర్తిగా విసిగిపోయార‌ని వ‌చ్చే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ గెలుపు త‌ధ్య‌మ‌ని ఆపార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తంచేస్తున్నారు. ఇక బీజేపీతోపాటు ఇత‌ర పార్టీలు, స్వ‌తంత్రులు కూడా బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో మున్సిప‌ల్ పోరు ర‌స‌వత్త‌రంగా మారుతోంది.

చైర్మ‌న్ పీఠం ఎస్టీ జ‌న‌ర‌ల్‌

2025 జనవరిలో మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్ప‌డింది. స్టేష‌న్ కేస‌ముద్రం, విలేజ్ కేస‌ముద్రం, అమినాపురం, ధనసరి, సబ్‌స్టేషన్ తండా గ్రామాలు ఈ కొత్త మున్సిపాలిటీలో భాగమయ్యాయి. దీంతో మేజర్ పంచాయతీగా ఉన్న కేసముద్రం పట్టణ ప్రాంతంగా అవ‌త‌రించింది. మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం సుమారు 20 వేల జ‌నాభా ఉంది. 1980 వ‌ర‌కు ఉమ్మ‌డి గ్రామంగా ఉండేది. 1981లో స్టేష‌న్‌, విలేజ్ కేస‌ముద్రంలు గ్రామ పంచాయ‌తీలుగా ఏర్ప‌డ్డాయి. దాదాపు 43 ఏండ్ల త‌ర్వాత మున్సిపాలిటీతో ఈ రెండు గ్రామాలు మ‌ళ్లీ ఒక్క‌టయ్యాయి. కేస‌ముద్రం మున్సిపాలిటీతో ఐదు గ్రామాలకు స‌ర్పంచ్‌ల‌తోపాటు, 56 వార్డు స‌భ్యులు, 6 ఎంపీటీసీ స్థానాలు క‌నుమ‌రుగ‌య్యాయి. వీటి స్థానంలో కొత్త‌గా ఆయా గ్రామాల్లోని 16 వార్డుల‌తో కేసముద్రం మున్సిపాలిటీ అవ‌త‌రించింది. కేస‌ముద్రం మున్సిప‌ల్ చైర్మ‌న్ పీఠం బీసీ జ‌న‌రల్ అవుతుంద‌ని గంపెడాశ‌తో ఎదురుచూసిన నేత‌ల‌కు షాక్ త‌గిలిన‌ట్ల‌యింది. ఎస్టీ మ‌హిళ‌కు కేటాయించ‌డంతో ముఖ్య నేత‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్లైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

సివిల్స్‌లో మెరిసిన యువత..!

సివిల్స్‌లో మెరిసిన యువత..! యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల దేశవ్యాప్తంగా తొమ్మిది వందల...

గణపతి లొంగుబాటు..!

గణపతి లొంగుబాటు..! అజ్ఞాత జీవితం వీడిన మావోయిస్టు అగ్రనేత నలభై ఏళ్లకు పైగా మావోయిస్టు...

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఆక్రమణలు కోర్టు కేసులున్నా నిర్మాణాలు ప్రగతినగర్...

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు కేంద్ర కమిటీ ఘాటు హెచ్చరిక ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు కుటుంబ...

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ గాంధీ కుటుంబానికి సంబంధించిన పెయిటింగ్‌ను జ్ఞాపిక‌గా...

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img