epaper
Sunday, March 1, 2026
epaper

లైట్స్ ఆఫ్.. షో అవుట్.. మూగబోయిన మూడు బాషల షో..!!

కాకతీయ, ఖిలా వరంగల్: పర్యాటకంగా ఓరుగల్లు కు పెట్టింది పేరు, ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వరంగల్ నగరానికి  వస్తుంటారు. ముఖ్యం గా కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోట లోని శిల్పారావం, కాకతీయ శిలాఖండాలు,  కాకతీయ కళా తోరణలు, కాకతీయుల కాలం నాటి శిల్పకళ నైపుణ్యం ప్రపంచ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూ అబ్బుర పరుస్తున్నాయి. నిత్యం దేశ నలుమూలల నుండి మరియు వివిధ దేశాల నుండి పర్యాటకులు ఖిలా వరంగల్ కోటకు వస్తుంటారు.

పర్యాటకంగా దేశ విదేశీయులను ఆకర్షిస్తున్న ఖిలా వరంగల్ కోటను మరింత అభివృద్ధి పరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో టూరిజం శాఖ  కోట్ల వ్యయంతో  ఖిలా వరంగల్ కోట శిల్పారామం లో ఇల్యూమినేషన్ లైట్స్ అండ్  సౌండ్ షో ఏర్పాటు చేసింది. గతేడాది మార్చి 7న ఈ లైట్స్ అండ్  సౌండ్ షోను  కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, కొండా సురేఖ లు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ లైట్ షో తో ఓరుగల్లు కు మరింత ప్రఖ్యాతి చెందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు కానీ ప్రారంభించిన మూన్నాళ్లకే మూగబోయిన సౌండ్ సిస్టంతో  లైట్ షో మూలన పడిపోయింది.

ఇది తెలియక  ఓరుగల్లు పర్యటనకు వచ్చిన దేశ విదేశీ పర్యాటకులు సౌండ్ అండ్ లైట్ షో పనిచేయడం లేదని తెలుసుకొని నిరాశతో వెళ్లిపోతున్నారు. 20 సెప్టెంబర్ 2025 శనివారం రోజున 27 దేశాలకు చెందిన 30 మంది పర్యాటకులు ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. కానీ సౌండ్ అండ్ లైట్ షో చూడ కుండానే నిరాశ తో వెనుదిరిగారు.

తూతూ మంత్రంగా టూరిజం శాఖ
కాకతీయుల సామ్రాజ్య విశిష్టతలను సౌండ్ అండ్ లైట్ షో తో దేశ విదేశీయుల పర్యాటకులకు తెలియజేయడం కోసం కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన సౌండ్ అండ్ లైట్ షో టూరిజం శాఖ నిర్లక్ష్యం వలన మూడు నెలలకే మూతపడిపోయింది. మూతపడి నెలలు గడుస్తున్న ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు.

అసలు ఏం జరిగింది, కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్ షో ఎందుకు నిర్వహించ లేకపోతున్నారని  కాకతీయ దినపత్రిక  ప్రతినిధి టూరిజం శాఖ సౌండ్ అండ్ లైట్ షో ఏఈ ను ఫోన్లో సంప్రదించగా, లైట్ షో స్క్రీన్ పాడైపోయింది. నాలుగు నెలల క్రితమే సింగ్ షేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చాము. కానీ ఇప్ప్పటికి స్క్రీన్ అందించ లేకపోతున్నారు, ప్రైవేట్ కంపెనీతో మాట్లాడుతున్నాం, ఇంకో వారం రోజుల్లో సౌండ్ అండ్ లైట్ షో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

అసలు సింగ్ షేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది

కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన సౌండ్ అండ్ లైట్ షో లో పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు మిగతా పరికరాలు, బాగానే ఉన్నా, కేవలం ఒక స్క్రీన్ రిపేర్ కోసమే నెలకొంది జాప్యం చేస్తున్నారంటే ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మర్మం ఏమిటో అర్థం కావడం లేదని, నెలలు గడుస్తున్న ఆ కంపెనీ కోసమే అధికారులు ఎందుకు ఎదురు చూస్తున్నారు అని  స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టూరిజం శాఖ మేల్కొని అతి తొందరలో మూగబోయిన కాకతీయ శిల్పారామంలో సౌండ్ అండ్ లైట్ షో నుండి కాంతులు వెదజల్లుతూ కాకతీయ సామ్రాజ్యం విశిష్టతనునేటి తరానికి కనిపించే వినిపించేలా మూడు భాషల్లో మోగించాలని స్థానికులు మరియు దేశ విదేశీ పర్యాటకులు కోరుకుంటున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img