మృతురాలి కుటుంబానికి చల్లా పరామర్శ
కాకతీయ, గీసుగొండ:బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడి తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఊట్ల బాపిరెడ్డి తల్లి రాధమ్మ కొద్దిరోజుల క్రితం మృతిచెందగా, ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా రాధమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పోలీసు ధర్మారావు, బీఆర్ఎస్ నాయకులు బోడకుంట్ల ప్రకాష్,చల్లా వేణుగోపాల్ రెడ్డి,గుర్రం రఘు, గోలి రాజయ్య,సుంకరి శివ తదితరులు పాల్గొన్నారు.


