ఉద్యమ కారుడికి చల్లా పరామర్శ
కాకతీయ, గీసుగొండ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో చురుకుగా పాల్గొన్న ఉద్యమ కారుడు కోట ప్రవీణ్ అనారోగ్యంతో బాధపడుతుండగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయన్ని పరామర్శించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామానికి చెందిన కోట ప్రవీణ్ అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆదివారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా కోట ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న చల్లా ధర్మారెడ్డి,ఆయనకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన కుక్కముడి సాంబయ్యను కూడా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


