ప్రజలను మోసం చేసిన బడ్జెట్
హామీలు అమలు కాని నిరాశాజనక బడ్జెట్
సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు ఎం.గిరి
కాకతీయ, బోనకల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల మాయాజాలంతో నిండిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు ఎం.గిరి విమర్శించారు. సంక్షేమ పథకాల అమలుకు సరిపడ నిధులు కేటాయించలేదని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు పెంపు, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలపై స్పష్టత లేదని తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు తగిన కేటాయింపులు లేవని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల హామీ కూడా అమలు కాలేదని పేర్కొన్నారు. కార్మిక సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. భారీగా అప్పులు తీసుకున్నప్పటికీ వాటి వినియోగంపై పారదర్శకత లేదని ఆరోపించారు. ఈ బడ్జెట్ కార్పొరేట్ అనుకూలంగా, ప్రజా వ్యతిరేకంగా ఉందని ఎం.గిరి తీవ్రంగా విమర్శించారు.


