- మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తక్కలపల్లి రాజేశ్వరరావు
కాకతీయ, హన్మకొండ : వందేమాతరం స్మారకోత్సవంలో ప్రజలంతా భాగస్వాములవ్వాలని వరంగల్ మాజీ మేయర్ తక్కలపల్లి రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్రంలో దొంతి దేవేందర్ రెడ్డి జిల్లా కన్వీనర్ ఆధ్వర్యo లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాలేజీ జంక్షన్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఆ రోజుల్లో వందేమాతరం నినాదం ఆంగ్లేయుల గుండెల్లో రైలు పరిగెత్తించిందని గుర్తు చేశారు.
ఆ స్ఫూర్తి నినాదం నేటికీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ మొత్తం మీద 120 కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈనేపథ్ంయలో ప్రధానమంత్రి పిలుపు నేపథ్యంలో ప్రతీ భారతీయ పౌరుడు దేశభక్తిని చాటుతూ వందేమాతరం గీత స్మారకోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ నాగపూరి రాజమౌళి గౌడ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి గంగాడి కృష్ణారెడ్డి నిషిధర్ రెడ్డి చౌడ రమేష్ బలరాం యోగానంద రవి కిరణ్ గౌడ్ చాడా స్వాతి వసంత మురళి. నాగపూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు


