తహశీల్దార్ కార్యాలయంలో వందేమాతరం గేయాలాపన
వందేమాతరం స్పూర్తినీ తెలిపిన తహశీల్దార్ రమేష్
కాకతీయ ఖానాపురం: స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం గేయంతో ప్రజల్లో జాతీయ స్పూర్తినీ రగిలించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహశీల్దారు నంగునూరి రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది, ప్రజలు వందేమాతరం గేయాన్ని ఆలకించారు. అనంతరం వందేమాతరం స్పూర్తినీ కార్యాలయానికి వచ్చిన సందర్శకులకు తహశీల్దార్ రమేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రాజా రేణుక, ఏఎస్ఓ సుగుణ, గిర్ధవారి స్వామి, గాయత్రి జిపిఓ లు స్వప్న, రాజు, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్,శివకోటి,అనిల్,రమేష్,ప్రజలు పాల్గొన్నారు.


