అంగరంగ వైభవంగా నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం.
కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి. కలెక్టర్ స్నేహ శబరిష్.
కాకతీయ, పరకాల: గురువారం పరకాల మండలం నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. డప్పు చప్పుళ్ళు, కోలాటాలు, బోనాలతో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వీట్ తినిపించి, శాలువాతో సన్మానించి, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ,పరకాల నియోజకవర్గంలోని నాగారం గ్రామంలో ప్రథమంగా ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.

గత ప్రభుత్వంలో శిలా ఫలకాలికే పరిమితమయ్యారని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.గత ప్రభుత్వ పాలకులు స్కీం లు, స్కామ్ లతో వెలకోట్లు సంపాదించారని ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ 500 బోనస్, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, కట్కూరి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సంబందిత అధికారులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.



