రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు
కాకతీయ, గీసుగొండ : ధర్మారం ఆది కన్వెన్షన్ హాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో వరంగల్ నుండి నర్సంపేట వైపు వెళ్తున్న ఎర్టిగా కారు (నంబర్ TS24H9504) డ్రైవర్ అతివేగంగా,అజాగ్రత్తగా రాంగ్ రూట్‌లో వెళ్ళి, ఎదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో AP36AA0716 మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూరజ్, ముకేశ్, విక్కి,AP28AH2343 మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న జాన్‌పాక గ్రామానికి చెందిన అహ్మద్ అలీ, షహీన్ సుల్తానా తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్,ప్రైవేట్ వాహనాల సహాయంతో హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే గీసుగొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పారిపోతున్న ఎర్టిగా కారును గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.క్షతగాత్రులనుఆసుపత్రికి తరలించడంలో,ట్రాఫిక్ నియంత్రణలో సహకరించిన ధర్మారం యువతకు సీఐ విశ్వేశ్వర్ అభినందనలు తెలిపారు.


