కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్ కు చెందిన విద్యార్థులు ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం క్రీడలను వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అన్ని వనరులు కల్పిస్తున్నామని తెలిపారు. ఇటీవల హుజురాబాద్‌లోని జెడ్ పి హెచ్ ఎస్ మైదానంలో జరిగిన ఎస్ జి ఎఫ్ జోనల్ స్థాయి హాకీ పోటీలలో తమ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.
ఎంపికైన విద్యార్థులు
అండర్–14 బాలురు విభాగం:ఏ. కృతిక్ పటేల్, కే. జయంత్,అండర్–14 బాలికలు విభాగం:కే. యుక్త, ఏ. నైనికా రెడ్డి, ఆకుల ఆశ్రిత,అండర్–17 బాలురు విభాగం:ఏం. రితిక్ రెడ్డి, జి. అక్షిత్,అండర్–17 బాలికలు విభాగం:కే. సాన్విక, జే. వర్షిక,ఎంపికైన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించిన డా. నరేందర్ రెడ్డి, రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


