కాకతీయ, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలిక విద్యాలయం, మండల ప్రజా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, తెలంగాణ మోడల్ స్కూల్ లను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైనింగ్ హాల్, టాయిలెట్స్ , స్టడీ రూమ్స్, కిచెన్ షెడ్, స్టోర్ గది, స్టడీ అవర్లో జరుగుతున్న తరగతులను, పరిసరాలను తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి విద్యాసామర్ధ్యాలను గమనిస్తూ సబ్జెక్టు వారిగా వారికి అర్థమయ్యే రీతిలో విద్యను అందించాలని సూచించారు. స్టోర్ గదిలో నాణ్యత ప్రమాణాలు ప్రకారం సామాగ్రిని పరిశీలిస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తూ ఉత్తమ విద్యను పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు. ప్రత్యేక అధికారులు, మండల స్థాయి గ్రామస్థాయి అధికారులు వారి పర్యటనలో భాగంగా ప్రతి విద్యాసంస్థలు సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం, విద్యా సౌకర్యాలను పరిశీలించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రమేష్ బాబు, ఎంపీవో కిన్నెరయాకయ్య, ఆర్ఐ అఖిల్, సంబంధిత విద్యా సంస్థల అధికారులు, సిబ్బంది ఉన్నారు.


