- జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ
కాకతీయ, ఖానాపురం : మొంథా తుఫాన్ వల్ల ఖానాపురం మండలంలో నష్టపోయిన పంటలను జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ గురువారం పరిశీలించారు. ఖానాపురం, ఐనపల్లి, బుధరావుపేట గ్రామాల్లో ఏడీఏ దామోదర్ రెడ్డి, స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారిని కె.అనురాధ మాట్లాడుతూ పంట నష్ట సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు నష్టపోయిన రైతుల వివరాలను వెనువెంటనే యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. అధికారులు అలసత్వం వహించకుండా నష్టపోయిన రైతులను పక్కాగా గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భోగ శ్రీనివాస్ వ్యవసాయ విస్తరణ అధికారులు చందన, రాజ్ కుమార్, అంకుషావలి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


