కాకతీయ, వేములవాడ : తెలంగాణ ఎన్జీఓల కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్ దంపతులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళాన్ని ఆలయ పర్యవేక్షకుడు సంజీవ్ కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ, తదితరులు పాల్గొన్నారు.


