- ఆపదలో రైతుకు సహాయం చేసిన జమ్మికుంట పోలీసులు
- తక్షణ స్పందించిన సీఐ రామకృష్ణ గౌడ్
- వడ్ల బస్తాలు మోసి మానవత్వం చాటుకున్న ఎస్సై సతీష్
కాకతీయ, హుజురాబాద్ : జమ్మికుంట పట్టణ పోలీసులు మానవత్వాన్ని చాటారు. జమ్మికుంట మండలానికి చెందిన రైతు రాజేందర్ తన వరిధాన్యాన్ని మార్కెట్‌కు తరలిస్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి పట్టణంలోని ఫ్లైఓవర్ పై వడ్ల బస్తాలు రోడ్డుపై చిందరవందరగా పడ్డాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతు సమాచారం అందుకున్న జమ్మికుంట సీఐ రామకృష్ణగౌడ్ తక్షణమే స్పందించి సిబ్బందిని ఘటన స్థలానికి పంపించారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న ఎస్సై సతీష్ స్వయంగా వడ్ల బస్తాలను ట్రాక్టర్‌పై ఎక్కించారు. రైతు బాధను తనదిగా భావించి సహాయం చేసిన ఎస్సైని స్థానికులు ప్రశంసించారు.


