కాకతీయ, కరీంనగర్ : స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థి కూన మాణికేశ్వర్ ఎస్ జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-17 బాలుర ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి విద్యార్థిని సత్కరించారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించే వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. మాణికేశ్వర్ జాతీయస్థాయిలో విజయాన్ని సాధించి కరీంనగర్ జిల్లాకు కీర్తి తేవాలని ఆకాంక్షించారు.
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


