కాకతీయ, నర్సంపేట : నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన ఆముదాల భాగ్యలక్ష్మి – లక్ష్మినారాయణ దంపతుల కూతురు ప్రహర్ష నీట్ లో అత్యంత ప్రతిభ కనబర్చి ఎంబీబీఎస్ సీటు సాధించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చిన్నపెళ్లి నర్సింగం మాట్లాడుతూ విద్యార్థులు బాల్యదశ నుంచే క్రమశిక్షణతో చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. మెడికల్ సీటు సాధించిన ప్రహర్ష భవిష్యత్తులో గొప్ప డాక్టర్ అయి పేదలకు వైద్య సేవలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పార్టీ క్లస్టర్ ఇన్చార్జి మోటురీ రవి, మాజీ ఎంపీటీసీ లు గడ్డం కొమురయ్య, బండారి శ్రీలత-రమేష్, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు అల్లి రవి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి, గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మంచిక దేవేందర్, మాజీ వార్డు సభ్యులు కొక్కు రాంరాజు, మాజీ స్కూల్ కమిటీ చైర్మన్ కొమ్మ రవి, మాజీ గ్రామ పార్టి అధ్యక్షుడు దుడేల ప్రకాశ్, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మాటురీ రవీంద్రచారి, యూత్ మండల సహయ కార్యదర్శి బుస శ్రీశైలం, సీనియర్ నాయకులు పర్స కోటిలింగం, మర్ద నవీన్, సామల సతీష్, యశోద నరసింగం, బండారి మధుకర్, కునమల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


