- పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ /సంగెం : ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగెం మండలం బిక్కోజి నాయక్ తండా గ్రామంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను ఆయన గ్రామ ప్రజలు, ఐటీడీఏ, సంబంధిత శాఖాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు రాకపోకలలో ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ రోడ్లను పునరుద్ధరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీముఖ్య నాయకులు పాల్గొన్నారు.


