-
కాంగ్రెస్ ధర్నాకు బీసీ సంఘాల మద్దతు
-
బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలి
-
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్ లో చర్చ పెట్టాలి
కాకతీయ, న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపు రిజర్వేషన్ల బిల్లును చట్టం రూపంలో తీసుకు రాకుంటే తెలంగాణలో కేంద్ర మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మూడున్నర నెలలు గడిచినప్పటికీ నేటి వరకు ఆ బిల్లుకు ఢిల్లీలో మూలుగుతుందే తప్ప దానికి ఇప్పటివరకు కేంద్రం పట్టించుకోకుండా అన్యాయం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల జనాభా 60 శాతం ఉన్నప్పటికీ 42 శాతానికే పరిమితం చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఒక మెట్టు దిగి బీసీలు పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెవిటి వారు ముందు శంఖం రోజున చందంగా వ్యవహరిస్తున్నదే తప్ప బీసీ రిజర్వేషన్ల బిల్లు ను పార్లమెంట్ లో పెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్ట రూపంలో తీసుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. జాతీయ పార్టీ అయిన బిజెపి గల్లీలో ఒక విధానం, ఢిల్లీలో ఇంకొక విధానం ఒలంపిస్తూ బీసీలను మోసం చేయాలని ప్రయత్నిస్తుండడం చాలా బాధాకరమన్నారు, దేశంలో 50% సామాజిక రిజర్వేషన్ల పరిమితులు అధిగమించి బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ పని చేయకుండా గల్లీలో హైదరాబాదులో ధర్నాలు చేస్తున్నడం చాలా సిగ్గుచేటు అన్నారు,
బిజెపికి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేపట్టాలని, లేదా ప్రధానంగా ఒప్పించి బీసీ రిజర్వేషన్లు పెంచి బీసీల మన్ననలను పొందాలని ఆయన సూచించారు. ముస్లిం రిజర్వేషన్ల సాకుతో బీసీల నోటికాడు ముద్దను గుంజుకుంటే బిజెపికి తెలంగాణలో రాజకీయంగా పుట్టగతులు ఉండవని, ఇలాగే బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తే బిజెపి బీసీల ద్రోహుల పట్టిక చరిత్రలో మిగిలిపోతుందని ఆయన మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న భారీ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, ఈ ధర్నాలో బీసీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ సర్పంచుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ జనగాం రవీందర్ గౌడ్, బీసీ సంఘాల నేతలు అక్కినపల్లి శ్రీనివాస చారి, పెద్ది వెంకటనారాయణ గౌడ్,కడమూరు ఆనంద్, తదితరులు పాల్గొన్నారు


