- పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునకు కవ్వంపల్లి ప్రచారం
కాకతీయ, కరీంనగర్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌నే గెలిపించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన, మహిళా కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షురాలు సునీతారావుతో కలిసి షేక్‌పేట్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలన్నారు. నవ నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నవీన్ యాదవ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రచార కార్యక్రమంలో బెజ్జంకి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పి.రాజశేఖర్ రెడ్డి, గూడెల్లి శ్రీకాంత్, రాసూరి మల్లికార్జున్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, రావుల నర్సయ్య, వి.సంపత్ రెడ్డి, పులి రమేశ్, మధుసూదన్, సాధిక్, వేణు, సంతు తదితరులు పాల్గొన్నారు.


