కాకతీయ, కరీంనగర్ : స్విట్జర్లాండ్‌కు చెందిన ఎఫ్డిఎంఎఫ్ సంస్థ సౌజన్యంతో విమెన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చామనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆర్.ఓ. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి జమున మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించడమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛమైన తాగునీటి కోసం ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. హెచ్ఎం సుగుణాకర్, ఉపాధ్యాయులు బుర్ర నాగరాజు, శ్రీనివాస్, రమాదేవి తదితరులు జమునకు కృతజ్ఞతలు తెలిపారు.


