కాకతీయ, బిజినెస్ డెస్క్ : ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి హిందుజా (85) కన్నుమూశారు. లండన్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపీచంద్ లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు పేర్కొన్నారు. హిందుజా కుటుంబంలో రెండో తరానికి చెందిన గోపీచంద్, ఆయన సోదురుడు 2023 మేలో శ్రీచంద్ మరణించిన తర్వాత గ్రూప్ సంస్థలకు చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీతా ఉన్నారు.
హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ కన్నుమూత
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


