కాకతీయ, నర్సింహులపేట : మండలంలోని కౌసల్యదేవిపల్లి క్లస్టర్లో మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం సర్వే చేశారు. అనంతరం మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని అన్ని క్లస్టర్లలో సర్వేచేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. రైతులు పంటల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో కళ్యాణి, రైతు చల్లమధు తదితరులు పాల్గొన్నారు.


