epaper
Saturday, November 15, 2025
epaper

విశ్వ విజేత‌గా భార‌త్‌

విశ్వ విజేత‌గా భార‌త్‌
ఐసీసీ వుమెన్స్ వ‌ర‌ల్డ్ కప్ కైవ‌సం
ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుపై ఘ‌న విజ‌యం
ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హ‌ర్మ‌ర్ కౌర్ సేన అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌
మహిళల క్రికెట్ చరిత్రలో స‌రికొత్త అధ్యాయం

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌ : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన హర్మన్‌సేన 52 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఎన్నోఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్‌ను ముద్దాడింది. అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో వందేమాతరం నామస్మరణ మధ్య తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ మ్యాజిక్.. షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ షో, అమన్ జోత్ కౌర్ స్టన్నింగ్ క్యాచ్ భారత్‌కు విజయాన్నందించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. 299 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లక్ష్య చేదనలో తడబడింది.

దుమ్ము రేపిన బ్యాటర్లు

మహిళల వన్డే ప్రపంచకప్ 2025‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత బ్యాటర్లు దుమ్ము రేపారు. దాంతో సఫారీ ముందు భారత్ 299 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 58 ) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది.
స్మృతి మంధాన(58 బంతుల్లో 8 ఫోర్లతో 45), రిచా ఘోష్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాక(3/58) మూడు వికెట్లు తీయగా.. మ్లబా, డిక్లెర్క్, ట్రయాన్ తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. పవర్ ప్లేను అద్భుతంగా వాడుకున్న ఈ జోడీ 64 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. హాఫ్ సెంచరీ ముంగిట స్మృతి మంధాన(45)ను ట్రయాన్‌ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి జెమీమా రాగా.. షెఫాలీ వర్మ తన జోరును కొనసాగించింది. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. 56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సునె లూస్ బౌలింగ్‌లో షెఫాలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బోచ్ నేలపాలు చేసింది. ఈ అవకాశంతో షెఫాలీ చెలరేగింది. మరో ఎండ్‌లో జెమీమా స్లోగా ఆడినా.. షెఫాలీ వేగంగా పరుగులు రాబట్టింది. సెంచరీ దిశగా సాగిన షెఫాలీ వర్మ అనవసర షాట్‌తో వికెట్ పారేసుకుంది. ఖాఖా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆదుకున్న దీప్తి శర్మ.. చెలరేగిన రిచా..

ఆ వెంటనే ఖాఖా బౌలింగ్‌లోనే జెమీమా కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అద్భతంగా క్యాచ్ అందుకుంది. ఈ పరిస్థితుల్లో హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. 52 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని మ్లబా విడదీసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(20)ను క్లీన్ బౌల్డ్ చేసింది. క్రీజులోకి వచ్చిన అమన్ జోత్ కౌర్(12) త్వరగానే వెనుదిరిగింది. దాంతో భారత్ 245 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రిచా ఘోష్‌తో కలిసి దీప్తి శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. రిచా భారీ సిక్స్‌లతో విరుచుకు పడగా దీప్తి శర్మ క్లాస్ బ్యాటింగ్‌ కొనసాగించింది. ఈ క్రమంలో 53 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రిచా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దాంతో 6వ వికెట్‌కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి బంతికి దీప్తి శర్మ రనౌట్‌గా వెనుదిరిగడంతో భారత్ 300 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది.

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన, దీప్తి శర్మ!

టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా మంధాన నిలిచింది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన ఫైనల్లో 45 పరుగులతో రాణించిన స్మృతి మంధాన.. ఈ టోర్నీలో మొత్తం 434 పరుగులు చేసింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డ్‌ను మంధాన అధిగమించింది. 2017 వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ 409 పరుగులు చేసింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఎడిషన్‌లో స్మృతి మంధాన సెకండ్ హయ్యెస్ట్ బ్యాటర్‌గా నిలిచింది. సౌతాఫ్రికా కెప్టెన్ లాలా వోల్వార్డ్ట్ 500+ రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఫైనల్లో షెఫాలీ వర్మతో కలిసి మంధాన తొలి వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించింది.

భారీ రికార్డు సృష్టించిన దీప్తి

దీప్తి శర్మ మరోసారి తాను టీమిండియా పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ ఎందుకో నిరూపించుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆమె మహిళల ప్రపంచ కప్ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది. ఒకే ఎడిషన్‌లో 200 పరుగులు, 15 వికెట్లు పూర్తి చేసిన మొదటి క్రీడాకారిణిగా దీప్తి నిలిచింది. ఆమె ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శన భారత్‌ను పటిష్టమైన స్థితికి చేర్చింది. రిచా ఘోష్‌తో ఆమె భాగస్వామ్యం అద్భుతంగా ఉంది. ఇద్దరూ కలిసి చివరి ఓవర్లలో పరుగుల వేగాన్ని పెంచారు. ఫైనల్ మ్యాచ్ లో దీప్తి శర్మ 53 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుంది.

కిక్కిరిసిన మైదానం..

ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ రెండు గంటలు ఆలస్యమైంది. అయినా అభిమానులు ఏమాత్రం సహనం కోల్పోలేదు. వర్షంలో తడుస్తూనే ఓపికగా ఎదురుచూశారు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీయడానికి మైదానంలోకి వచ్చిన ప్రతిసారీ చప్పట్లతో వారిని ఉత్సాహపరిచారు. ఇక వార్మప్ కోసం భారత జట్టు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు స్టేడియం మొత్తం హోరెత్తింది. 18వ ఓవర్‌లో జెమీమా రోడ్రిగ్స్ బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు అభిమానుల కేరింతలు తారాస్థాయికి చేరాయి. గతంలో భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ఇదే స్టేడియంలో 34,651 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఈ స్టేడియం మొత్తం సామర్థ్యం 45,000. ఇంతవరకు ప్రపంచ కప్ గెలవని రెండు జట్లు టైటిల్ కోసం తలపడటం, దానికి ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడం మహిళల క్రికెట్‌కు గొప్ప శుభపరిణామమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అభిమానుల్లో తీవ్ర ఆసక్తి..

ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక సెమీ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఆ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అజేయ శతకంతో (127) జట్టును గెలిపించిన తీరు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి ఆమె నెలకొల్పిన 167 పరుగుల భాగస్వామ్యం అందరినీ కట్టిపడేసింది. ఈ విజయంతో ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ‘సోల్డ్ అవుట్’ అని బ్యానర్ ప్రదర్శించాల్సి వచ్చిందని ఐసీసీ తెలిపింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్‌ సిద్ధం.. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌!

దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్‌ సిద్ధం.. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌! ఈడెన్ గార్డెన్స్...

అలా చేస్తేనే ఇండియా జట్టులో స్థానం..

అలా చేస్తేనే ఇండియా జట్టులో స్థానం.. విరాట్-రోహిత్‌కు బీసీసీఐ అల్టిమేటం! విరాట్, రోహిత్‌పై బీసీసీఐ...

దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌కి ముందు గంగూలీ సజెషన్‌..

దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌కి ముందు గంగూలీ సజెషన్‌.. జురేల్‌కు సపోర్ట్‌! కాక‌తీయ‌, స్పోర్ట్స్ :...

ఓడినా.. నేనే కెప్టెన్‌

ఓడినా.. నేనే కెప్టెన్‌ టీ 20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను నడిపిస్తా.. సొంతగడ్డపై ఓట‌మితో చాలా...

టీమిండియాదే సిరీస్

టీమిండియాదే సిరీస్ భార‌త్‌.. ఆస్ట్రేలియా ఆఖరి టీ 20 రద్దు.. ఓపెనర్లు గిల్.. అభిషేక్...

శ్రీచరణితోనే భారత్ గెలిచింది

శ్రీచరణితోనే భారత్ గెలిచింది మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంస‌ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్...

ఎవ‌రు గెలిచినా.. చ‌రిత్రే..!

ఎవ‌రు గెలిచినా.. చ‌రిత్రే..! మ‌రి కొద్దిసేప‌ట్లో మ‌హిళ‌ల వన్ డే మ్యాచ్ ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా...

భార‌త క్రికెట‌ర్ మృతి

భార‌త క్రికెట‌ర్ మృతి కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : మాజీ భారత అండర్-19...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img