కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు లాభం
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కాకతీయ, నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండల వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఆదివారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తో కలిసి పత్తి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు కోరుకున్న రోజే స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తి తీసుకువస్తే కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అదే విధంగా ధ్యానం, మొక్కజొన్న రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులను, వ్యాపారులను ఆదేశించారు. రైతులు కూడా తేమ శాతం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకొని తీసుకురావాలని కోరారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని రైతులను కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట వివరాలను క్షేత్రస్థాయిలో అధికారులు నమోదు చేస్తున్నారని, పంట నష్టపోయిన రైతులు అధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రాంరెడ్డి,ఆర్డీవో ఉమారాణి , డీసీఓ నీరజ ,డీఎం సివిల్ సప్లయర్ సంధ్యారాణి , డీసీఎస్ఓ కిష్టయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, మార్కెట్ ఛైర్మన్లు పాలాయి శ్రీనివాస్, హరీశ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


