ఆర్థిక సాయం అందజేత
కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన ఎమ్డీ షకీల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆకుతోట సతీష్ మానవతా దృక్పథంతో స్పందించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఆదివారం బాధితునికి ఆర్థిక సాయం అందజేశారు. బాధితుడికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మానసిక ధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో మద్ది రాజేష్, వెన్నం క్రాంతి, శ్రీశైలం, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.


