విప్లవ వీరుడి ఆశయాలను కొనసాగిద్దాం
ఆదివాసీ బిర్ధ్ గోండ్ తోటి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్సుకోల తిరుపతి
కాకతీయ, ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ గ్రామంలో గిరిరత్నవెడ్మ రాము 38వ వర్ధంతిని ఆదివాసి సంస్కృతి – సాంప్రదాయాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసి బిర్ధ్ గోండ్ తోటి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్సుకోల తిరుపతి హాజరై మాట్లాడారు. విప్లవ వీరుడు వెడ్మ రాము ఆశయాలను కొనసాగించాలన్నారు. గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించాలన్న ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. అంతరిస్తున్న తెగలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు నైతం శేఖర్, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడప నాగేష్, తుడుందెబ్బ డివిజన్ అధ్యక్షులు అత్రం మహేందర్, రాష్ట్ర కార్యదర్శి చాహటి పవన్, నాయక్పొడ్ సంఘం సంగెం రమేష్, రాష్ట్ర కౌన్సిలర్ వెడ్మ విజయ్ ప్రకాష్, సింగర్ చహ్కాటి రవి, కథలే విఠల్ రాయి సెంటర్ సభ్యులు వెడ్మ మారుతి, కుమ్ర మెతిరాం, లవన్,ఏఎస్సై రమేష్,పెంధోర్ తులసీరాం, సిడం మురళీకృష్ణ,పైకు పటేల్, గణపతి, సంతోష్, తొడసం రాములు, భీంరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.


