కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఘన విజయంలో సునీల్ రావుకు కర్ర రాజశేఖర్ కృతజ్ఞతలు.
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పాలక మండలి ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ విజయానికి దోహదం చేసిన మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ని కర్ర రాజశేఖర్ తన గృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ సునీల్ రావు అందించిన మార్గదర్శకత, సహకారం తమ విజయానికి బలమైన ఆధారమైందని కర్ర రాజశేఖర్ అన్నారు.ఈ సందర్భంగా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ కలిసి కర్ర రాజశేఖర్‌కి స్వీట్ తినిపించి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. బ్యాంక్ అభివృద్ధికి పారదర్శకమైన, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పాలక మండలి పనిచేయాలని సునీల్ రావు ఆకాంక్షించారు.


