కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని కోమటిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు ప్రహారీ లేని విషయాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు గ్రామ మాజీ సర్పంచ్ నీలం యాకయ్య తెలిపారు. ఆయన వెంటనే ప్రహారీ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. ఆ పనులను శనివారం నీలం యాకయ్య ఆధ్వర్యంలో భూమిపూజ చేసి ప్రారంభించారు. ఎంపీ రవిచంద్రకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దీకొండ వెంకన్న, కురెల్లి సతీష్, నీలం యాకయ్య, యాకమూర్తి, పూజారి కొమరయ్య, నీలం వెంకన్న, రావుల మల్లేశం, గడ్డం ఐలయ్య, దొండ శ్రీనివాస్, గడ్డం శ్రీనివాసు, గాడిపెళ్లి రాజాలు, కొమ్మినబోయిన ఐలయ్య, షేరు శ్రీనివాస్, పాషా, ఇసంపెళ్లి మల్లయ్య, పూజారి లింగన్న, ఉమ్మగాని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


