- కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
- పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
కాకతీయ, హుజురాబాద్ : కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతిగా వ్యవహరిస్తుందని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం హుజురాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో రూ.47,62,000 విలువగల 135 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పేదవారిపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో ఎలాంటి జాప్యం వహించం, చెక్కులు వచ్చిన వెంటనే లబ్ధిదారుల చేతికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చెక్కులు అందుకున్న వారు వాటిని వెంటనే బ్యాంకుల్లో జమ చేయాలని సూచించారు. పేదల పార్టీగా, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలవడం తమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు, మరియు ఇంచార్జి ప్రణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ, మండల, జమ్మికుంట పట్టణ, మండల, వీణవంక, కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


