అజారుద్దీన్‌కు హోంశాఖ ?
లేదంటే మైనార్టీశాఖ ఇచ్చే అవకాశం?
రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
ఏ శాఖ ఇచ్చినా నిబ్బద్ధతతో పనిచేస్తానన్న కొత్త మంత్రి
రెండు మూడు రోజుల్లో క్లారిటీ..
రాజ్‌భవన్‌లో కొత్త మంత్రిగా ప్రమాణస్వీకారం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అజారుద్దీన్‌కు ఇవ్వబోయే శాఖపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్న అజారుద్ధీన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఏ మంత్రిత్వ శాఖ కట్టబెట్టబోతున్నారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. ఈక్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఏ శాఖ ఇవ్వాల్లో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారన్నారు. ముఖ్యనేతలు, పార్టీ సీనియర్ల ముందు ప్రమాణస్వీకారంచేయడం ఆనందంగా ఉందన్నారు. తాను ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని, తనకు ఎవరి సర్టిపికెట్ అవసరంలేదన్నారు.
హైకమాండ్ సూచనలు
ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన (జీఏడీ), హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, కమర్షియల్ టాక్సెస్, విద్యాశాఖ, న్యాయశాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలు ఉన్నాయి. ఇన్నాళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోంశాఖను అజారుద్దీన్‌కు ఇవ్వనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ అజారుద్ధీన్ కు హోంశాఖ అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరానికే చెందిన మైనార్టీ నేత ..అప్పటి డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి హోదాతోపాటు కీలకమైన రెవెన్యూ, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, అర్బన్‌ల్యాండ్ సీలింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కేటాయించారు. కేసీఆర్ రెండో మంత్రివర్గంలోనూ మహమూద్ అలీకి తెలంగాణ హోంశాఖ, జైళ్లు, అగ్నిమాపక శాఖ కేటాయించడం గమనార్హం. ఈక్రమంలోనే అజారుద్దీన్‌కు కీలకమైన హోంశాఖను రేవంత్ సర్కార్ కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.


