- కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి భూక్యా ప్రవీణ్ నాయక్
కాకతీయ, బయ్యారం : భారత ఉక్కు మహిళ, భారతదేశ మొట్టమొదటి మహిళ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని గంధంపెల్లి, కొత్తపేటలో ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ఐక్యత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అర్పించిన మహానేత అని కొనియాడారు. ఇందిరమ్మ చూపిన మార్గదర్శనం ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల ప్రభాకర్ రెడ్డి, జూలకంటి సీతారాం రెడ్డి, మాజీ అధ్యక్షులు వడ్లమూడి సురేష్ బాబు, మాజీ ఎంపీపీ గుగులోత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ములుకూరి వీరారెడ్డి , ఇతరులు బోడ రమేష్, బానోత్ నాగరాజు, పుల్లూరి బాలరాజు, సూరం సుధాకర్ రెడ్డి, పోతుగంటి సుమన్, బాలకృష్ణ, చెరుకుపల్లి నర్సయ్య, మండ నాగరాజు, నాగరాజు, వీరన్న, నెహ్రు, బాబా,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


