- బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి
కాకతీయ, నల్లబెల్లి : మొంథా తుఫాన్ ప్రభావంతో నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. మండలంలోని ధర్మరావుపల్లి, రంగాపూర్, మామిం డ్ల, వీరయ్యపల్లి, బోల్లోనిపల్లి, నాగరాజుపల్లి, రేలుకుంట, ముచింపుల్ల తండ గ్రామాల్లో పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి, పత్తి, మిర్చి పంటలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసి ఎకరానికి యాభై వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో రైతులకు ఎకరానికి పదివేల పరిహారం అందినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఊడుగుల ప్రవీణ్ గౌడ్, గందే శ్రీనివాస్ గుప్తా, మామిండ్ల మోహన్ రెడ్డి, తోటకూరి లచ్చమ్మ, ఊరటి అమరెందర్, పోలు దాసరి రమేష్, గాదె కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.


